బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈరోజు కోర్ట్ లో ప్రవేశపెట్టగాడిసెంబర్ 24 వరకు కస్టడీలో ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పేస్ బుక్, సోషల్ మీడియాలలో ముఖ్యమంత్రులు, ప్రదానులుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన శిక్ష ఉంటుందని, ఇదివరకటిలా వదలేదిలేదని అన్నారు.
