న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ గెల్చుకుంది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 65 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి. కానీ.. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి 19 స్థానాల్లో మాత్రము బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. బల్లిమారన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి హరూన్ యూసుఫ్ ఆధిక్యంలోకి వచ్చినా గెలిచే పరిస్థితి లేదు.. ఢిల్లీలో నార్త్ ఢిల్లీలోని 3 స్థానాల్లో కౌంటింగ్ నిలిచిపోయింది. షకుర్ బస్తి, ఆదర్శ్ నగర్, మోడల్ టౌన్ లలో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆ కౌంటింగ్ సెంటర్ లో పరిస్థితిని రివ్యూ చేసి కౌంటింగ్ కొనసాగించనున్నారు.
