Home / CRIME / కొడుకుని బయట నిలబెట్టి లాడ్జి లోపల తల్లి ప్రియుడితో రాసలీలలు..తండ్రి వీడియో కాల్.. కొడుకు ఏం చెప్పాడు

కొడుకుని బయట నిలబెట్టి లాడ్జి లోపల తల్లి ప్రియుడితో రాసలీలలు..తండ్రి వీడియో కాల్.. కొడుకు ఏం చెప్పాడు

కన్నకొడుకు ఎదుటే ఓ తల్లి బరితెగించింది. ఏకంగా లాడ్జికి తీసుకెళ్లి కొడుకుని బయట నిలబెట్టి లోపల ప్రియుడితో రాసలీలలు సాగించింది. బయట నిలబడిన కొడుకుని ప్రియుడు కొట్టినా పట్టించుకోలేదు. అదే సమయంలో ఆమె భర్త వీడియో కాల్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. తండ్రితో ఫోన్ మాట్లాడిన నాలుగేళ్ల కొడుకుని దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ప్రియుడు పారిపోగా తల్లి అరెస్టైంది. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచికి చెందిన దీపకి విక్రమాన్సింగపురానికి చెందిన ఆంటోని ప్రకాష్‌తో 2015లో వివాహమైంది. వాళ్లిద్దరికీ నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు. అయితే దీపకి అదే గ్రామానికి చెందిన సొరిముత్తు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రకాష్ పనికి వెళ్లిన తరువాత వాళ్లిద్దరూ కలిసి రాసలీలలు సాగించేవారు. కొడుకు ఎదుటే తల్లి ప్రియుడితో ఎంజాయ్ చేసేది.

ప్రియుడిని కలిసేందుకు నిన్న కొడుకుని తీసుకుని సమీపంలోని ఓ లాడ్జికి వెళ్లింది దీప. అక్కడ ప్రియుడు సొరిముత్తు నాలుగేళ్ల లోకేష్‌ని చెంపమీద కొట్టి లాడ్జి గది బయటే నిలబెట్టాడు. కొడుకు ఏడుస్తూ బయట నిలబడినా తల్లి లోపలికి వెళ్లి ప్రియుడితో రాసలీలలు సాగించింది. కొడుకు ముందే పరాయి వ్యక్తితో పడక సుఖం పంచుకుంది. అదే సమయంలో దీప భర్త ప్రకాష్ ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్య, కొడుకు కనిపించపోవడంతో భర్తకు అనుమానం కలిగింది. తాను పనికి వెళ్లాక భార్య ఎవరితోనే సంబంధం నెరుపుతోందని సందేహించాడు. వెంటనే ఫోన్ తీసి భార్య దీపకి వీడియో కాల్ చేశాడు. ఎంతకీ భార్య ఫోన్ తీయకపోవడంతో అతని అనుమానాలు బలపడ్డాయి. మళ్లీ ఫోన్ చేయడంతో కొడుకు లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో కథ అడ్డం తిరిగింది.

ప్రియుడితో రాసలీలలు సాగించేందుకు లాడ్జి గదిలోకి వెళ్తూ తన ఫోన్‌ని కొడుకు లోకేష్‌కి ఇచ్చి వెళ్లింది దీప. అదే సమయంలో తండ్రి ప్రకాష్ ఫోన్ చేయడంతో లోకేష్ ఫోన్ ఎత్తి మాట్లాడాడు. వీడియోలో చిత్రాలు చూసిన ప్రకాష్.. కొడుకుని అడిగి మెల్లగా వివరాలు తెలుసుకున్నాడు. తనను లాడ్జి గది బయట నిలబెట్టి తల్లి ఎవరితోనో లోపల ఉందని చెప్పేశాడు కొడుకు. అలాగే ఆమె ప్రియుడు తనను కొట్టాడని ఏడుస్తూ చెప్పడంతో ప్రకాష్ అనుమానాలు నిజమయ్యాయి. అయితే తమ ఇద్దరి వివాహేతర సంబంధం వ్యవహారం చిన్నారి ప్రకాష్‌కి చెప్పిన విషయం దీప, సొరిముత్తుకి తెలిసిపోయింది. అంతే… కోపంగా వచ్చిన ముత్తు పిల్లాడిని విచక్షణారహితంగా చావబాది పారిపోయాడు. ఆ దెబ్బలకు లోకేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దీపను అరెస్టు చేశారు. ముత్తు ఇంకా పరారీలోనే ఉన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat