సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్‌కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్’కి అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో రూపొందించారు.
అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి హాసన్ ఈ సినిమాతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. 2011 మే 11న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ చూడండి అంటున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా, ‘గబ్బర్ సింగ్’ సినిమాని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సెప్టెంబరు 2వ తేదిన ‘గబ్బర్ సింగ్’ సినిమాని 100 షోలతో మళ్లీ విడుదల చేయాలనుకుంటున్నానని, థియేటర్లలో ఈ సారి పవన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుందామని గణేష్ అన్నారు. ‘గబ్బర్ సింగ్’ని మరోసారి వీక్షించి పండగ చేసుకుందామని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా వకీల్ సాబ్తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేయనున్నట్టు ఇది వరుకే ప్రకటించారు. .
Get Ready for Rampage Theatre Pagilipodhi ? pic.twitter.com/T6enbzzXB3
— Guru? (@GuruRS4545) August 27, 2021