ఆయన ఇండియన్ జేబ్స్ బాండ్., కొన్నేళ్లుగా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి.. ఉగ్రవాదులను పసిగట్టేందుకు ప్రాణాల ఫణంగా పెట్టి ఇన్ఫర్మేషన్ సేకరించిన గూఢచారి అజిత్ దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో ఉగ్రవాద ప్రభాల్యం ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించి సత్తా చాటారీయన.. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అయిన దోవల్‌కు మోదీ కీలక బాధ్యతనే అప్పగించారు. త్రివిధదళాలకు ఒకేబాస్ ఉండేలా ఎర్రకోట బురుజుల వేదికగా ప్రధాని ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవికి అర్హులైనవారిని ఎంపిక చేసే బాధ్యతను దోవల్‌కు అప్పచెప్పారు. CDS పదవికి నిబంధనలను రూపొందించడానికి దోవల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి భద్రతా వ్యవహారాల కమిటీ సూచించిన సూచనలను అమలు చేయాలని రక్షణమంత్రిత్వశాఖ ఇప్పటికే దోవల్‌కి లేఖ కూడా రాసింది. ప్రస్తుతం త్రివిధ దళాలకు చీఫ్ లు ఉన్నా కీలక సమయాల్లో వారి సమన్వయం కుదరకపోవడంతో మూడు విభాగాలను మేనేజ్ చేయడానికి ప్రత్యేకంగా ఓ చీఫ్ ఉండాలనే ఉద్దేశంతో ఈయనను నియమించారు. మోదీ సూచనపై సైనికవర్గాల నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలోనే దోవల్ ను మనం ఆ పదవిలో చూడొచ్చు. ఇప్పటికే కేంద్రహోం మంత్రి తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలకు దోవల్ తోడైతే శత్రుదేశాలకు భారత్ అంటే ఒణుకే.
