బాదం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.బాదం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఇలా ఎనెన్నోమంచి విషయాలు బాదం గురించి పోషకాహార నిపుణులు చెప్పుతుంటారు.ఖరీదు ఎక్కువైనా బాదం పట్ల ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు.అయితే బాదం తీనెందుకు ఓ పద్ధతి వుంది .సాధారణంగా మార్కెట్లో బాదం బాగా ఎండిన స్వీట్ రూపంలో దొరుకుతుంది.దానిని అలాగే తీ సుకోవడం కంటే కుడా ఎనిమిది గంటలపాటు నానబెట్టిన తరువాత తీసుకుంటే..ఎక్కువ ఉపయోగం ఉంటుందని పోషకాహార నిపుణులు చెప్పుతుంటారు.అలా నానబెట్టడం వల్ల బాదం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
నవయవ్వన సౌందర్యం కోసం..ఎనిమిది గంటలపాటు బాదాన్ని నానబెట్టడం వల్ల దానిపై వుంటే తొక్క తేలిగ్గా ఊడిపోతుంది.తరువాత మిగిలే బాదం తేలిగ్గా జిర్ణమవుతుంది.బాదం తీ సుకోవడం వల్ల వయస్స మీద పడ్డ ఛాయలు మీ చర్మం మీద కనిపించకుండా ఉంటాయి .ముడతలు పడకుండా నివారించే గుణం బదంలో వుంటుంది.మిటమిన్ E బాదంలో ఉండటమే దీ నికి కారణం.బాదాన్ని పేస్ మాస్క్ గా కూడా వినియోగించుకోవచ్చు
కొవ్వు తగ్గించే ఔషధం …బాదంలలో వుండే ఒమైగా ఫాతియే ఆమ్లాలు చెడు కొవ్వును తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.బరువు తగ్గించడంలోనూ బాదం కీలక పాత్ర పోషిస్తుంది.బాదం రోజు తీ సుకోవడం వలన శరీరానికి తగిన పోషకాలు అందడంతో పాటు…అతి ఆకలి తగ్గుతుంది.తద్వారా మితమైన ఆహారం తీ సుకోవడం జరుగుతుంది.
రక్తపోటును అదుపులో వుంచడం..డయాబెటిస్ సమస్యలు తగ్గించడమే కాకుండా మెదడు పని తీ రును వేగవంతం చేయడంలో బాదం పాత్ర చాలా కీలకం.శరీరంలో ని ఏమ్యునిటి సిస్టం ని మరింత మెరుగు పరిచే గుణం నానబెట్టిన బాదంలో కనుగున్నారు.
అన్నింటికన్నా ముఖ్యమైనది క్యాన్సర్ కనుతులను బాదం వృద్ది చేయనియ్యదు.రోజువారి ఆహారంలో బాదం తీ సుకుంటే క్యాన్సర్ వల్ల కలిగే ముప్పును కొంతవరకు తగ్గించుకున్నట్లే.జీవన క్రియను మెరుగుపరచడం ద్వారా బాదం శరీరానికి పూర్తి ఆరోగ్యాన్నిచ్చె దివ్యౌషధం అనిపించుకుంటుంది.బాదంలో వున్నా పిచు పదార్ధాలేదానికి కారణం.