Home / 18+ / పాపం చిన్నారి రోజూ పస్తులే…ఈ పాపం ఎవరిదీ.. కధ వింటే కనీళ్ళు తప్పవు !

పాపం చిన్నారి రోజూ పస్తులే…ఈ పాపం ఎవరిదీ.. కధ వింటే కనీళ్ళు తప్పవు !

ప్రస్తుతం భారతదేశంలో ప్రతీదానికీ ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి కాదని  సుప్రీమ్ కోర్ట్ స్వయంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆధార్ లింక్ లేనిచో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల రేషన్ షాప్ లలో బియ్యం కూడా ఇవ్వడంలేదు. ముఖ్యంగా రేషన్ కి ఆధార్ లేని కారణంగా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. దీనికి ఒక చిన్నారి బలయ్యింది. ఒడిస్సాకు చెందిన సీమా ముండా అనే చిన్నారి ఆధార్ లింక్ లేక ప్రతీరోజు పస్తులు ఉండాల్సివస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఈమె వయసు 11ఏళ్ళు. ఈ అనాధ పిల్ల ఒడిస్సా లోని ఒక మారుమూల గ్రామంలో ఉంటుంది. బతుకు తెరువు కోసం అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకొని అవి అమ్మితే వచ్చిన డబ్బుతో పొట్ట నిప్పుకుంటుంది. అలా జరగని ఎడల ఆరోజుకు ఆ చిన్నారి పస్తులు ఉండాల్సిందే. ఇక వర్షం పడితే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇక కట్టెలు అమ్మితే వచ్చే 40 రూపాయలతో వంట సామాను కొనుక్కోవాలి.

ఈ చిన్నారి తల్లితండ్రులు చనిపోయాక ఆమె తాత దగ్గరే ఉంటూ చదువుకునేది. ఇద్దరూ తాతకు రేషన్ నుండే వచ్చే సరుకులతో కడుపు నింపుకునేవారు. తాత రేషన్ పై వచ్చే 10కిలోల బియ్యంతో కష్టం అయినప్పటికీ ఏదోలా గడిపేస్తున్నారు. ఆ చిన్నారి దురదృష్టం ఏమిటో తెలియదుగాని కొన్ని రోజులకి తాతయ్య చనిపోవడంతో ఎవరూలేని అనాధగా మిగిలిపోయింది. దాంతో 10కిలోల బియ్యం కాస్త 5కిలోలకు తగ్గిపోయింది. అంతేకాకుండా చదువు కూడా మానేసింది.

అలా కొన్ని రోజులకి ఆ చిన్నారికి రేషన్ నుండి వచ్చే సరుకులును నిలిపేశారు. ఎందుకు అనే విషయానికి వస్తే ఆ చిన్నారి ఆధార్ రేషన్ కి లింక్ చెయ్యలేదనే కారణంతో ఆ గ్రామా పంచాయితి ఆమెకు ప్రభుత్వం నుండి రావల్సిని అన్నీ నిలిపివేసింది. దాంతో ఒక్కసారిగా ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కట్టెలు అమ్మితే వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తుంది. తన భాద తెలుసుకున్నవారు కన్నీరు పెట్టుకుంటున్నారు.

ఈ ప్రాంతాల్లో చాలా మందికి బయట ప్రపంచమే తెలీదు. ఇలాంటి వారికి దగ్గరుండి అన్ని వివరించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన అవగాహన లేకపోవడంతో సీమా లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat