కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మరోసారి జైలు ఊసలు లెక్కెట్టనున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆయన్నిఅరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు. ఆయన్ని ప్రశ్నించాక అవసరమైతే అరెస్ట్ చేయడానికి జడ్జి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కేసు విషయంలో బెయిల్ కోరుతూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.