Home / ANDHRAPRADESH / అమెరికా డ్రోన్ తయారీ కంపెనీ..ఇక ఆంధ్రలో కూడా..?

అమెరికా డ్రోన్ తయారీ కంపెనీ..ఇక ఆంధ్రలో కూడా..?

అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్‌ తయారీ కంపెనీ డీజేఐ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. డ్రోన్లపై జరుగుతున్న పరిశోధనలకు గాను నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ సీఈవో ఆళ్ల రవీంద్ర రెడ్డి తెలియజేసారు. డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం  కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీని ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెల్పారు పెట్టుబడులను ఆకర్షించడం కోసం కర్నూలు జిల్లాలో ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో సుమారు 100 ఎకరాల్లో ఒక డ్రోన్‌ పార్కును ఏర్పాటు చేయాలని ధ్యేయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 600 డ్రోన్లను వినియోగిస్తున్నట్లు అనధికారిక అంచనాగా ఉందని, అయితే వీటి వినియోగానికి సంబంధిత జిల్లా ఎస్పీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లేనియెడల చట్టరీత్య చర్యలు తీసుకొని అవకాశం ఉన్నదని   రవీంద్రరెడ్డి స్పష్టం చేశారు.