బొప్పాయి ఏమిటి…. మతిమరుపుకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా…? బొప్పాయితో మతిమరుపుకు చెక్ చెప్పవచ్చని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ బొప్పాయి పండును తింటే మతిమరుపు సమస్య తీరిపోతుందట.
ఇదే కాదు బొప్పాయితో ఇంకా అనేక రకాల ప్రయోజనాలున్నాయి.
– బొప్పాయి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుందట.
– కాలేయం పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉందట. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా
చేసి రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది.
– బొప్పాయి పాలను తేలు కుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది.
– బొప్పాయి గింజలతోనూ ప్రయోజనముంది. గింజల్ని ఎండబెట్టి పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులి పురుగులు
పోతాయి.
– బొప్పాయి ఆకులను వేడి నీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గిపోతుంది.
Post Views: 224