నిద్ర అనేది అందరికీ ఆవశ్యకమే. నిద్ర పోతేనే శరీరం ఉత్తేజంగా మారుతుంది. మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. అయితే ఇంత వరకు ఓకే. కానీ తలను ఓ దిక్కుకు పెట్టి నిద్రించే విధానంలో చాలా మంది తేడా చూపిస్తున్నారు. దీంతో వాస్తు దోషం ఏర్పడుతోంది. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వాస్తు పరంగా అసలు తలను ఏ దిక్కు పెట్టి నిద్రిస్తే మంచిదో, ఏ దిక్కుకు తలను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమికి అయస్కాంత క్షేత్రం ఉంటుందని చదువుకున్నాం కదా. ఉత్తర, దక్షిణ ధృవాలు కూడా ఉంటాయి. ఇవి అయస్కాంత క్షేత్రాల్లా పనిచేస్తాయి. అలాగే మనిషిలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ క్రమంలో తల వైపు ఉత్తర దిశ క్షేత్రం, కాళ్ల వైపు దక్షిణ దిశ క్షేత్రం ఉంటుందట. అందుకనే తలను ఉత్తరం వైపు పెట్టకూడదని చెబుతారు. ఎందుకంటే శరీర పరంగా తల వైపు ఉత్తర దిశ క్షేత్రమే ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి భూమిపై ఉండే ఉత్తర దిశకే పెడితే అప్పుడు సజాతి ధృవాలు రెండు వికర్షించుకున్నట్టు అవుతుంది. దీంతో శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఉత్తర దిశగా తలను పెట్టి నిద్రించడం వల్ల అయస్కాంత క్షేత్ర ప్రభావం శరీరంపై పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుందట. గుండె సమస్యలు వస్తాయట. రక్త నాళాల్లో రక్తం గడ్డకడుతుందట. పక్షవాతం వచ్చేందుకు అవకాశం ఉంటుందట. గుండె సరిగ్గా కొట్టుకోదట. దీనికి తోడు నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన ఎదురవుతాయట. కనుక ఉత్తర దిశగా తలను పెట్టి నిద్రించకూడదట. అయితే మరి దిశల్లో తలను పెట్టొచ్చు..? అంటే.. అన్ని దిశల్లోనూ తలను పెట్టి నిద్రించవచ్చట. కానీ ఉత్తర దిశకు మాత్రం తలపెట్టకూడదని వాస్తు చెబుతోంది.