Home / LIFE STYLE / మీ చేతిలో ఉన్న రేఖలతో మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఇలా తెలుసుకోవచ్చట..!

మీ చేతిలో ఉన్న రేఖలతో మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఇలా తెలుసుకోవచ్చట..!

సాముద్రిక శాస్రంప్రకారం చేతిరేఖలద్వారా భవిష్యత్తుని తెలుసుకోవచ్చట. అయితే మీ చేతిలోని ఒక రేఖ మాత్రం భవిష్యత్తుకి సూచిక కాకపోయినా.. కాని రాబోయే రోజుల్లో వచ్చే మార్పులను ముందే చెప్పేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో జరిగే అనేక సంఘటనలపై మాత్రం దీనిప్రభావం ఉంటుందట. పురాతన కాలంలో చేతి వేళ్లు, రేఖలు, వాటి పరిమాణం, పొడవును బట్టి భవిష్యత్తు తెలుసుకోవడానికి సాముద్రిక శాస్రాన్ని ప్రమాణికంగా తీసుకునేవారు. చేతిలోని వివిధ రేఖలు జీవితంలో జరగబోయే వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం లాంటివిషయాలని తెలియజేస్తాయంటున్నారు. వీటిల్లో ముఖ్యమైనది వివాహ రేఖ.. ఈరేఖ మీకు ఏసమయంలో పెళ్లి జరుగుతుందో ఖచ్చితంగా తెలియజేస్తుందట. అయితే..

వివాహ రేఖ చిటికెన వేలికి, హార్ట్ లైన్ కి మద్య ఉంటుందట. ప్రధాన రేఖను ఆనుకొని చిన్న రేఖలు ఉంటే అనేక మదితో సంబధాలు, వ్యవహారలు లేదా నిష్చితార్దం జరిగిన తర్వాత రద్దు చేసుకోవడం లాంటివి సంభవిస్తాయి. పెళ్లి రేఖల సంఖ్య, వాటి స్థానం, ఆకారాలు.. వివాహ స్వభావం, జీవిత భాగస్వామి ఆరోగ్యం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయట. హార్ట్ లైన్, వైవాహిక రేఖకు మద్య ఎక్కువ దూరంగా ఉన్న వ్యక్తులకు ఆలస్యంగా పెళ్లిజరుగుతుందట. అంటే పురుషులకు 32 యేళ్ల తర్వాత, మహిళలకు 27 యేళ్ల తర్వాతే వివాహం యోగం ఉంటుందని హస్త సాముద్రికా శాస్త్ర పండితుల ఉవాచ.

ఈ రేఖ పరిమాణం పొడుగ్గా ఉండేవారికి 25 యేళ్లకు పెళ్లి జరిగి నిజమైన ప్రేమను పొందుతారట. అలాగే చిన్నగా, అస్ప్రష్టంగా ఉండే వారికి మాత్రం అపరిపక్వ దశలోనే వివాహం జరుగుతుందట. ఒకవేళ హార్ట్ లైన్ లేదా ఇతర రేఖలతో కలిసి ఉన్నట్టయితే 23 యేళ్ల లోపే ఓ ఇంటి వారవుతారని చెబుతున్నారు పండితులు. చిటికెన వేలికి దగ్గరగా ఉంటే మాత్రం పెళ్లి ఆలస్యమవుతుందట. అంతే కాదు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండే అవకాశం కూడా లేకపోలేదట. వైవాహిక రేఖ మద్యలో చీలిక ఏర్పడితే పెళ్లైన తర్వాత భాగస్వామితో విడిపోవడానికి సంకేతమని చెబుతున్నారు. అంటే వారు విడాకులు కూడా తీసుకోవచ్చునట. వివాహ రేఖ పక్క నుంచి చిన్న చిన్న రేఖలు కనబడితే ఒకేసారి ఇద్దరి వ్యక్తులతో ప్రేమలో పడతారట. ఇలాంటి వాళ్లు పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ నమ్మకస్తులకు సంబంధించిన విషయాలు మాత్రమేనండోయ్..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat