Home / LIFE STYLE / మేధావులకు సాధారణంగా ఉండే 15లక్షణాలు.. ఇవి మీలో ఉన్నాయా..!

మేధావులకు సాధారణంగా ఉండే 15లక్షణాలు.. ఇవి మీలో ఉన్నాయా..!

మేధావులకు కొన్ని సహజమైన, సాధారణ లక్షణాలుంటాయట. వీటి గురించి చెబితే ఓసి.. ఇవేనా? అంటారు. కాని.. వాటిని అందరూ ఆచరించలేరు. ఆయా లక్షణాలను తూచ తప్పకుండా పాటించే వారిని, ఇంకా సింపుల్ ఫై చేసి చెప్పాలంటే తమ సహజ నైజంగా మార్చుకున్న వారు సమాజంలో ఖచ్చితంగా మేధావులుగా గుర్తింపు పొందుతారట. మేధావులకు మాత్రమే ఉండే లక్షణాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. మేధావులన గానీ అన్నీ మంచి లక్షణాలు ఉండాలనేం లేదు.. కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి.. అవి కూడా చూడండి…

ఊహాత్మక శక్తి, సృజనాత్మకత: మేధావులు ఏ విషయాన్నైనా అది జరిగినా, జరగకపోయినా ముందుగానే ఊహించగలరు. దాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్దగలరు.

తమలో తాము మాట్లాడుకోవడం: వీరు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ తమలో తాము మాట్లాడుకుంటారు. అయితే వీరి ఆలోచనల స్థాయిని, నాణ్యతను బట్టి వీరు మేధావులు అని నిర్ణయిస్తారు ఎదుటి వారు.

ఎప్పుడూ ఒంటరిగా, ప్రశాంతంగా ఉండాలనుకోవడం : వీరు సాధారణంగా సంఘ జీవులు కారు. ఎక్కడ పది మందిలోకి వెళితే తమ ఆలోచనలకు, ఆశయాలకు అవాంతరం కలుగుతుందో అన్న భావనలో చాలావరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు.

బద్దకస్తులు: ఆశ్చర్యం ఏమిటంటే వీరు చాలా బద్దకంగా కూడా ఉంటారు. ఎందుకంటే వీరి మెదడు చాలా ఎక్కువగా పని చేస్తుంది కాబట్టి త్వరగా అలసిపోతుంది.

నిరుద్యోగులుగా ఉండడం: వీరు ఎవరికిందా పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు పనిచేసే ఆఫీస్ లో పై అధికారులకు వీరికంటే తక్కువ ఆలోచనలతో ఉంటారు. అందుకే అటువంటి వారి ఆజ్ఞలను పాటించడానికి వీరు సిద్దంగా ఉండరు.

వ్యాకులత చెందకుండా ప్రశాంతంగా ఉంటారు: వీరు ఏవిషయానికీ కంగారు పడరు. విషయం ఎంతపెద్దదయినా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. తలకు మించిన భాధ్యత నెత్తిన వేసుకోరు.

ఏమరుపాటుగా ఉండడం: ఎప్పుడూ ఏదో పరధ్యానంలో ఉంటారు. చిన్న చిన్న విషయాలను ఊరికనే మర్చిపోతారు.

ఫ్యాషన్ ఇష్టం ఉండదు: వీరికి భౌతిక సౌందర్యం పై మక్కువ ఏమాత్రం ఉండదు. కనీసం గడ్డం చేసుకోవడం కూడా టైమ్ వేస్ట్ అని భావిస్తారు. దాదాపు పిచ్చివాడిలా కనిపిస్తారు.

ఏదో ఒకచెడ్డ అలవాటుకు బానిసలవుతారు: వీరి మెదడులో జరిగిన ఎన్నో యుద్దాల తరువాత వీరు సేద తీరడానికి ఏదో ఒక సరదా ను.. అంతే పొగ తాగడం, మద్యం సేవించడం, పాన్, గుట్కా లాంటివాటికి బానిస అవుతారు.

శారీరక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వరు: వీరికి శారీరక సంబంధాలు, శారీరక సుఖాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. బ్రహ్మచారి జీవితాన్నే ఇష్టపడతారు. చాలా మంది శాస్త్రజ్ఞులు బ్రహ్మచారిగా ఉంటారు లేదా భార్యను వదిలేసి వంటరిగా ఉంటారు. పెళ్లి చేసుకున్నా కుటుంబ వ్యవహారాల్లో వీరి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది.

ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువ వింటారు: వీరు ఏది పడితే అది మాట్లాడరు. ప్రపంచాన్ని చూసి, విని నేర్చుకుంటారు. కాబట్టి వీరికిమాట్లాడే టైమ్ ఉండదు.

కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం: వీరికి కొత్తవి నేర్చుకోవడం తెలుసుకోవడం సరదా. వారి పని వారే చేసుకుంటారు పక్కవారిపై ఆధారపడకుండా ఉండాలి అనే నైజంతో ఉంటారు.

కల్మషం లేకుండా నవ్వడం: వీరి నవ్వు చాలా పరిపూర్ణంగా కల్మషం లేకుండా ఉంటుంది. చిన్న చిన్న జోక్స్ కి కూడా బాగా నవ్వుతారు.

మొదటి సంతానం: కుటుంబం లోని పిల్లలందరిలో పెద్దవారు ఎక్కువ మేధావులుగా ఉంటారు. దీనికి కారణం మొదటి సంతానం పై తల్లిదండ్రులు చూపించే శ్రద్ద, తమకు బాధ్యతలుంటాయని వారు చిన్న నాటి నుంచే గుర్తించడం మేధావులుగా మారుస్తుంది. తల్లి శరీరం మొదటి శిశువుకు ఇచ్చినంత మద్దతు రాను రాను ఇవ్వలేకపోవడం.

తల్లిపాలు ఎక్కువ గా తాగడం: పిల్లలు తాగినంత కాలం తల్లి పాలను ఇవ్వడం వలన వారిని మేధావులుగా తీర్చి దిద్దవచ్చు. తల్లిపాలు మెదడు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat