జామ కాయలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి, అధిక బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు జామ కాయల వల్ల మనకు కలుగుతాయి. అయితే జామ కాయలే కాదు, జామ ఆకుల వల్ల కూడా మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులు నీటిలో ఉడుకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. విరేచనాలు, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
2. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.
3. జామ ఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి. అంతే కాకుండా జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది.
4. జామ ఆకుల్లో విటమిన్- బి పుష్కలంగా ఉంటుంది. విటవిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి.
5. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడుకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి.