చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు.ఒక్కపూట టీ తాగకపోతే ఏదో వెలితిగా ,తలనొప్పిగా వుంటుంది.సాయంత్రం పూటా డీ లా పడినట్లు అనిపిస్తే..టీ పడితే చాలు మళ్ళీ రీ చార్జ్ అయిపోతాము . .అయితే మనం త్రాగే చాయలోను రకరకాల వెరైటీ లు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు.ఉపశమనానికి ,ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వున్నాయి.అవేంటో తెలుసుకుందాం.
తేనేటి లో వుండే కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది.కానీ అధిక మోతాదులో టీ త్రాగేస్తే…నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి . టీ లోని థీయోఫైలిన్ అనే రసాయనం డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది .ఇది మలబద్దకానికి దారి తీస్తుంది .ఉదయాన్నే టీ త్రాగడం వలన విరేచనం సాఫీ గా అవుతుందని చాలా మంది నమ్ముతారు.కానీ అధిక మోతాదులో టీ త్రాగితే మలబద్దకం వస్తుంది.కెఫీన్ మూడును మర్చేస్తుందనేసంగతి తెలిసిందే కదా కానీ కెఫీన్ మోతాదు పెరిగితే నిద్ర పట్టక పోవడం,విశ్రాంతి లేకపోవడం,హృదయ స్పందనల రేటు పెరగడంలాంటి సమస్యలు తలెత్తుతా యి .గర్బం దాల్చిన వారు టీ మనేయ్యడమే ఉత్తమం.పిండం ఎదుగుదలకు కెఫీన్ హనీ కలిగించే అవకాశం వుంది .అదే జరిగితే అబార్షన్ అవుతుంది..