భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలర్..సోలో బ్రతుకే సో బెటర్..అంటూ..అప్పుడెప్పుడో “మనీ” సినిమాలో కోట శ్రీనివాస్‌రావు పాడిన పాటను ఇప్పటి యూత్ బాగా ఫాలో అవుతున్నారు… పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ..అబ్బో ఇవన్నీ..మనకు ఎక్కడ సెట్ అవుతాయి గురూ…జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ.. సోలోగా బతికేస్తా పోలే..అంటూ ఇప్పటి మెజారిటీ యూత్ ఫీల్ అవుతున్నారు. అందుకే వద్దురా..సోదరా… పెళ్లంట నూరేళ్లమంటరా…అంటూ మ్యారేజీలు చేసుకుకోకుండా గడిపేస్తున్నారు..అయితే పెళ్లి పెటాకులు లేకుండా సోలోగా బతికే మగవాళ్లు 60 ఏళ్లకు మించి జీవించరని..శాస్తవేత్తలు అంటున్నారు. సోలోగా బతికే ఆలోచనే మగవారి జీవిత కాలాన్ని తగ్గిస్తోందని తాజాగా వెల్లడైన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరిగా ఉండే మగవారి ఆయుష్షు తగ్గడానికి గల కారణాలను ఈ సందర్భంగా గుర్తించారు. సాధారణంగా పురుషులకు నలభై ఏళ్ల తర్వాత ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. పెళ్లయిన వారిలో భార్యలే భర్తల ఆరోగ్యం మీద శ్రద‌్ధ చూపుతారు. అదే పెళ్లి కాని పురుషులు 40 ఏళ్ల తర్వాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టరు. వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు లేక తొందరగా మృత్యువాత పడే ప్రమాదముందని వారు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం అంటే లైఫ్ రిస్క్ తీసుకోవడమే అని వారు స్పష్టం చేస్తున్నారు. చూశారుగా సోలో బతుకే సో బెటర్ అనుకుంటే..తొందరగా పైకిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. పెళ్లికాని ప్రసాదులు ఇక ఆడతోడు కోసం ప్రయత్నించడం బెటర్..పెళ్లంటే నూరేళ్ల మంట కాదు..నూరేళ్ల పంట..హ్యాపీగా పెళ్లి చేసుకుని..పెళ్లాం పిల్లలతో నిండు నూరేళ్లు జీవించండి..ఓకేనా..!
