తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిన్న సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన సంగతి తెల్సిందే..
ఈ క్రమంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. .. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 2వేల కేసులు నమోదవుతున్నాయి…