Home / 18+ / వైఎస్ నీకు స్నేహితుడే నిజమే కానీ… ఆయన చనిపోయాక ఎంత దారుణంగా చంద్రబాబు మోసం చేసాడో తెలుసా.?

వైఎస్ నీకు స్నేహితుడే నిజమే కానీ… ఆయన చనిపోయాక ఎంత దారుణంగా చంద్రబాబు మోసం చేసాడో తెలుసా.?

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. చంద్రబాబు అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించగా చంద్రబాబు అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడితే ముందు రాష్ట్రంలో అడ్డుగా అనుమతిలేని విగ్రహాలను కూల్చేయాలన్నారు. దీంతో అధికారపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ “నేనూ వైఎస్ కు శత్రువును కాదు.. మేమిద్దరం స్నేహితులం.. ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం.. జగన్ కు ఈ విషయాలు తెలీకపోవచ్చు. నేను టీడీపీలోకి వచ్చాను, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారంటూ నవ్వుతూ చెప్పారు. అయితే ఇలాంటి వాఖ్యలు గతంలో చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు.

వైఎస్ చంద్రబాబు మధ్య స్నేహం ఉందని నామమాత్రంగా తెలిసినా బహిరంగంగా వైఎస్ తో స్నేహం గురించి చంద్రబాబు చెప్పటం ఇక్కడ విశేషం.. అలాగే చంద్రబాబు సూచనలతో తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కూడా చంద్రబాబు వైఎస్ ను ఎన్టీఆర్ కు స్నేహితుడిగా పరిచయం చేసారు. అయితే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపట్ల వైసీపీ విరుచుకుపడుతోంది. చంద్రబాబునుద్దేశించి ఇలా అంటున్నారు.. నిజమే.. వైఎస్ఆర్ మీకు మంచి స్నేహితుడే.. అది ఒకప్పుడు.. కాని, మీరు మాత్రం ఆయన పట్ల దారుణమైన మిత్ర ద్రోహానికి పాల్పడ్డారు.. ఆయన బ్రతికినంతకాలం నోరు ఎత్తలేదు కాని, మరణించాక ఆయన క్యారక్టర్‌ను అవహేళన చేశారు. ఆయన తిరిగి రాలేడని అవినీతి ఆరోపణలు మొదలుపెట్టారు.

అతని కుమారుడిని నిష్కారణంగా జైలుకు పంపారు. దొంగ అనే ముద్రవేయటానికి ప్రయత్నించారు. ఆయన కుటుంబాన్ని రోడ్డున వేసేందుకు ప్రయత్నించారు. ఆయన ఆస్తులను సీజ్ చేయించేందుకు ప్రయత్నించారు. ఏకంగా అతనిని హత్య చేయించేందుకు కుట్రపన్నారు. ఆఘటననుంచి అతను బయటపడ్డాక కోడికత్తి అంటూ అవహేళన చేశారు. ఎన్నో నీచమైన ఆరోపణలు చేయించారు. ఇన్నిచేసారు.. ఎవరైనా స్నేహితుడు, స్నేహితుని కుమారుడి పట్ల ఇలా ప్రవర్తిస్తారా.? అంతా చేసి ఇపుడు నాకు వైయస్సార్ మంచి స్నేహితుడు అంనడానికి కొంచెం కూడా సిగ్గు, శరం, నీతి, నిజాయితీ, మానం అభిమానం ఉండాలి చంద్రబాబు గారూ అని దుమ్మెత్తిపోస్తున్నారు.

అలాగే వైఎస్ కూడా నీకోసం చాలా చేసారు.. నెలజీతం లా ఆయన సొంతకంపెనీ మంగపేట బైరటీస్ నుండి కొంతమొత్తం ఇచ్చారు.. నువ్వు చావు బతుకుల మధ్య ఉంటే పార్టీని కూడా పక్కన పెట్టి మరీ వచ్చి పలకరించాడు.. ప్రజాస్వామ్యంగా నీకోం అలిపిరి వద్ద ధర్నా చేశాడు.. నువ్వు కాళ్ళు పట్టుకుంటే నిన్ను కేసుల నుండి బయట పడేశాడు.. నీ బామ్మర్ధి ఫైరింగ్ చేసినపుడు పోనీలే మెంటల్ ఉంది కదా అని వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు.. అయినా నువ్వు ఆయన చావుని హేళన చేశావు.. కాంగ్రెస్ తో చేతులుకలిపి ఆయన కుటుంబాన్ని రోడ్డున పడేసావు. నీది అసలు ఒక బతుకేనా.? నీ అవినీతి, స్కాములు బయటపడేకొద్ది నాటకాలాడుతున్నావ్.. అవసరం అయితే ఎంతకైనా దిగజారతావు.. ఒకవేళ జగన్ దయ చూపిస్తే చంద్రబాబు తన నక్క తెలివితేటలతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆయనని వదిలేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే సీఎం గారు అంటూ జగన్ కు సైతం సహాలిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat