తమిళనాడు సీఎం పళనిస్వామి టీటీడీ వైభవాన్ని కొనియాడారు.. తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పళనిస్వామి మద్దతిచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్నిలో సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీటీడీలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి పళనిస్వామికి వివరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు మరింత సులువుగా దర్శనం కల్పించేందుకు పళనిస్వామి సూచనలు చేశారు. వసతులను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలగురించి ఇరువురు కొద్దిసేపు చర్చించారు. అంతకుముందు సుబ్బారెడ్డి శ్రీవారి తీర్ధప్రసాదాలను సీఎం పళనిస్వామికి అందజేసి శాలువాతో ఆయనను సత్కరించారు.
