Home / LIFE STYLE / గులాబీ రంగు పెదాలను పొందడానికి ఇలా చేయండి…!

గులాబీ రంగు పెదాలను పొందడానికి ఇలా చేయండి…!

మందమైన, సమాన ఆకృతి గల పెదాలను కలిగి ఉండాలని ప్రతి మహిళ ఆశ పడుతుంది. అయితే, ఈ ఆశ చాలామందికి కలగానే మిగిలిపోతుంది. రోజువారీ మేకప్ వాడకం మరియు సూర్యరశ్మి వలన మీ పెదాలకు ఊహించని విధంగా ప్రమాదం ఏర్పడుతుంది. మనలో చాలామంది ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకునే సమయంలో వారి పెదాలను విస్మరిస్తూ ఉంటారు మరియు మన జీవనశైలి అభిరుచులు వలన పెదాలు ముదురు రంగులోకి మారి, వాటి ఆకృతిని కోల్పోతాయి. మరలా సరైన ఆకృతిలో లేత రంగు పెదాలను పొందడానికి ఈ వ్యాసం చదవండి!

కొంత చక్కెరను ఉపయోగించండి (Use some sugar)

చక్కెర సహజమైన స్క్రబ్ మరియు అద్భుతమైన ఎక్స్‌ఫ్లోలేటర్. తేనెలో చక్కెర కలిపినట్లయితే త్వరిత మరియు సమర్థవంతమైన స్క్రబ్ సిద్ధమవుతుంది. చక్కెర వలన పొడిబారిన మరియు నిష్క్రియ చర్మ కణాలు రాలిపోతాయి, తేనె వలన మీ పెదాలకు పోషణ, తేమ లభిస్తుంది, ఈ విధంగా అవి మృదువుగా మరియు లేత రంగులోకి మారతాయి.

కొంత నిమ్మరసాన్ని ఉపయోగించండి (Squeeze some lemons)

నిమ్మరసంలోని ఆమ్లం సహజ బ్లీచ్ వలె పని చేస్తుంది. కనుక, ఇది పెదాల యొక్క ముదురు రంగును తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది మరియు చర్మ కాంతిని పెంచుతుంది. అప్పుడే పిండిన నిమ్మరసంతో పడుకోవడానికి ముందు మీ పెదాలపై మర్దనా చేయడం వలన మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఆ నిమ్మరసంతో మిగిలిన ముఖం కూడా మర్దనా చేసుకోవచ్చు, ఎందుకంటే నిమ్మరసం మొటిమల మచ్చలను మరియు చర్మంపై ముదురు రంగు మాసికలను తొలగిస్తుందని తేలింది.

కొన్ని గులాబీ పువ్వులను ఉపయోగించండి (Get some roses)

రోడ్ వాటర్ వలన మీ చర్మ మెరుపు పెరుగుతుంది, మీకు గులాబీ పూరేకుల వంటి మృదువైన గులాబీ వర్ణం లభిస్తుంది. కొద్దిగా తేనెలో కొంచెం రోజ్ వాటర్ కలిపి, రోజూ ఆ మిశ్రమంతో మృదువుగా రుద్దుకోవాలి. కొన్ని రోజుల్లోనే, మీరు తేడాను గమనించవచ్చు. ఇంకా, కొంచెం పాలలో రోజ్ వాటర్ కలిపి, దానిని ముఖానికి పూసుకున్నట్లయితే, మంచి ఫలితం కనిపిస్తుంది.

కొంత ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి (Grab some olive oil)

ఆలివ్ వలన కలిగే ప్రయోజనాలు అపరిమితం. మీ చేతులోకి కొంచెం ఆలివ్ నూనెను తీసుకుని, పెదాలకు పూసుకోండి. దీని మాయిశ్చరైజింగ్ గుణాలు మరియు పోషకాలు వలన కొన్ని రోజుల్లోనే మీ పెదాలు లేత రంగును సంతరించుకుంటాయి. మీరు ఎక్స్‌ట్రా వర్జిన్ నూనెను ఉపయోగించినట్లయితే అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి. రోజూ మీరు పడుకోవడానికి ముందు కొన్ని ఆలివ్ నూనెను మీ పెదాలుపై రాసుకోండి. కొన్ని వారాల్లోనే, మీరు తేడాను గమనించవచ్చు, మీకు మంచి, మృదువైన పెదాలు కనిపిస్తాయి.

దానిమ్మ గింజలను ఉపయోగించండి (Use pomegranates)

సహజ లేత రంగులోని పెదాలు కోసం దానిమ్మ గింజలను ఉపయోగించాలి. దీనిలోని పోషకాలు పొడిబారిన పెదాలకు పోషణతో పాటు తేమను అందిస్తాయి. ఇంకా, ఇది సహజ పెదాల విలేపనం వలె పని చేస్తుంది, దీని సహాయంతో మీరు మీ పెదాల సంరక్షణలో మీ లిప్‌స్టిక్ మరియు మెరుపు పూతను తొలగించుకోవచ్చు.

దంచిన దానిమ్మ గింజలను పాల క్రీమ్‌లో కలిపి, ఆ మిశ్రమంతో ప్రతిరోజూ మీ పెదాలపై మర్దనా చేసుకోవాలి. ఇంకా, మీరు దీనిని బీట్‌రూట్ రసంలో కూడా కలుపుకుని, శక్తివంతమైన విలేపనం వలె ఉపయోగించవచ్చు. లేత రంగులోని కనిపించే మృదువైన పెదాలను పొందడానికి అవసరమైన అంశాలు మీ ఫ్రిడ్జ్ మరియు వంట గదిలోనే ఉన్నాయనే సత్యం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat