ఇండియా అంటే ఒక సంప్రదాయ దేశం..అది ఒకప్పటి మాట. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం మైంటైన్ చేస్తున్నారు అనుకుంటే అది నిజంగా మీ భ్రమే అనుకోవాలి ఎందుకంటే ఈరోజుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చాక అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఎవరి ఫ్రీడమ్ వారికి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దాంతో అందరూ డేటింగ్ యాప్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు డేటింగ్ అంటే పెళ్లి కానివారు చేసుకునేది అనుకున్నారంతా కాని ఈ రోజుల్లో ఆ పదానికి అర్ధమే మార్చేసారు. ఒక ఇండియాలోనే ఎన్నో పాపులర్ డేటింగ్ యాప్స్ లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఆన్ లైన్ డేటింగ్ యాప్ వినియోగించేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.
ఇటీవల నార్టన్ లాక్ అనే సంస్థ పలు భారతీయ నగరాలలో స్మార్ట్ ఫోన్ల వినియోగం.. డేటింగ్ యాప్స్ పై ఒక సర్వే నిర్వహించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే ఈ డేటింగ్ యాప్ సేఫ్టీనే అని 44% పురుషులు చెప్పగా అత్యధికంగా 66% మహిళలు నమ్ముతున్నారు. ఇక ఈ సర్వే పరంగా చూసుకుంటే ఒక హైదరాబాద్ లోనే 46% ఈ డేటింగ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మహిళల విషయంలో మొత్తంగా చూసుకుంటే 35 నుండి 55 వయసు ఉన్నవారే దీనిని ఎక్కువగా వాడుతున్నారని సమాచారం. ఈ సమాచారం ప్రకారం చూసుకుంటే ఆంటీలు ఆ విషయంలో కొట్టిమిట్టాడుతున్నారు అని చెప్పాలి.