కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు.
see also..ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..!
ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం వెల్లడించిన తర్వాత వారూ దాన్ని సమర్థించినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఇద్దరూ కలిసికట్టుగా వెళ్లి ప్రధానికి రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి రాజీనామాలు సమర్పిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.