ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్ జగన్ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన మహాసభలో సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.
see also:ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?
తాజాగా వైఎస్ జగన్ ఆటోవాలాలను ఆదుకుంటారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం పూతలపట్టు మండలంలో గడప గడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పి.కొత్తకోటలోని ఆటోస్టాండ్ వద్ద ఆయన ఆటోడ్రైవర్లతో మాట్లాడారు. అనంతరం తామంతా జగన్ కు అండగా ఉంటామంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకు ఖాకీ చొక్కా తొడిగారు. ఎమ్మెల్యే ఆటోలో డ్రైవర్లను ఎక్కించుకుని కొంతసేపు చక్కర్లు కొట్టడంతో పలువురు ఆసక్తిగా చూశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్ల మద్దతు ఉంటుందని తెలిపారు.