Home / ANDHRAPRADESH / లక్ష దీపోత్సవం పోస్టర్ రిలీజ్‌ చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..!

లక్ష దీపోత్సవం పోస్టర్ రిలీజ్‌ చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..!

పత్తికొండకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి రానున్నారు. ఈ నెల 25 న పత్తికొండ , ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారతీయుల వెలుగు శిఖరం ,హైందవ ధర్మకవచం, నడిచే దైవం, దైవ స్వరూపులు,విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంతో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర ఆంధ్రప్రదేశ్‌ హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం కానుంది. ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమానికి సంబంధించి..పోస్టర్‌ను ఈ రోజు కర్నూలులో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విశా‌ఖ శారదాపీఠం స్వామిజీల ఆశీస్సులు పొందవలసిందిగా పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, వెల్దుర్తి తుగ్గలి మండలాల కన్వీనర్లు రవి రెడ్డి, నాగేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిరాయి జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat