Home / ANDHRAPRADESH / డిఎస్సీ పోస్టుల భర్తీ పై శాసనసభలో వివరణ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి సురేష్

డిఎస్సీ పోస్టుల భర్తీ పై శాసనసభలో వివరణ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి సురేష్

గౌరవ సభ్యులు మెగా డిఎస్సీ గురించి అడిగారు.. సీఎం గారు ప్రతి సంవత్సరం ఖాలీలు అంచనా వేసి, ఒక క్యాలెండర్‌ తయారు చేసుకుని,ప్రతి శాఖకు కూడా ఈ క్యాలెండర్‌ అఫ్‌ రిక్రూట్‌మెంట్‌ను తయారు చేయమన్నారు. నిర్ధిష్ట కాలంలో రిక్రూట్‌మెంట్‌ చేయాలని చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆర్నెల్ల కాలంలో ఉపాధ్యాయుల స్ధితిగతులను మెరుగుపర్చేందుకు 15వేల పోస్టులకు ప్రమోషన్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది.
దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. తెలుగుభాష మీద వారు మాట్లాడుతున్నారు. తెలుగుభాషను తొక్కేస్తున్నామని చెప్తున్నారు. 16 సంవత్సరాలుగా తెలుగుభాషా పండితులకు ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేదో వారు(టిడిపి) సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్‌ తీసుకురమ్మన్నారు. 12వేల మంది భాషా పండితులకు మేం ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది.
ఎక్కడా లేని విధంగా 12వేల పోస్టులు శాంక్షన్‌ చేయడంతో పాటు ఇప్పటికే 9వేల మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. మరో రెండువేల మంది ఎస్జీటీలకు కూడా ప్రమోషన్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల స్ధితిగతులను మెరుగుపర్చాలని మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పామే దాన్ని అక్షరసత్యంగా తూచా తప్పకుండా ఆర్నెల్ల కాలంలోనే చేసి చూపించాం. స్కూల్‌ అసిస్టెంట్లే కాకుండా గ్రేడ్‌ 2 హెచ్‌ఎంలకు కూడా ప్రమోషన్లు ఇచ్చాం. స్కూల్‌ అసిస్టెంట్లు, గ్రేడ్‌ 2 హెచ్‌ఎంలు 15వేల పోస్టులుంటే వాటì కి అప్‌గ్రేడ్‌ చేసి అనుమతులిస్తే… ఇప్పటికే 6500 పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చాం. భాషా పండితులు ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో మేం వచ్చిన వెంటనే వీటిని పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు దఫాలు సమీక్ష నిర్వహించారు. 12వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే స్టూడెంట్‌ టీచర్‌ రేషియో ఉందో దాని ప్రకారం ఇంకా టీచర్లను నియమించుకోవాల్సి ఉంది కాబట్టి ఆ ప్రక్రియ నడుస్తోంది. ఈలోగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్చర్లను నియమించుకోవాల్సి ఉంది దానిలో భాగంగా 7వేల పై చిలుకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్చర్లను నియమించడానికి ప్రతిపాదనలు చేశాం. మూడు నెలల కాలానికి సుమారు రూ.12కోట్ల ఖర్చుతో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్చర్లను నియమించడానికి దస్త్రం గౌరవ ముఖ్యమంత్రిగారి అనుమతి కోసం పంపించాం.

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్చర్‌ల గురించి గౌరవ శాసనసభ్యులు (ఆళ్ల రామకృష్ణారెడ్డిగారు) వారు అనుమానాలు వ్యక్తం చేసారు. దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. డిఎస్సీ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్రమైన సమీక్ష నిర్వహించి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఇచ్చారు. వేకెన్సీస్‌ అరైజ్‌ అవడం, ప్రిపరేషన్‌ లాంటివి ఉంటాయి. కాబటి 2018 డియస్సీ ఏదైతే ఉందో దానిపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. దానిపై కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. త్వరలోనే ఈ కోర్టు కేసులు క్లియర్‌ చేసిన తర్వాత వేకెన్సీస్‌ ఏవైతే ఉన్నాయో ఆ ఖాలీలను భర్తీ చేస్తాం. ఈ ట్రాన్సిట్‌ పీరియడ్‌లో ఈ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్చర్స్‌ను వాడుకోవడం జరుగుతుంది. మూడు నెలల కాలపరిమితితోనే వీరిని తీసుకోవడం జరిగింది. అవసరమైతే పొడిగిస్తాం. ప్రధానంగా స్టూడెంట్‌–టీచర్‌ రేషియో ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్ధలో జరుగుతున్న సంస్కరణల వల్ల యావత్‌ భారత్‌దేశం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం రైట్‌ టు ఎడ్యుకేషన్‌ పాలసీ అని చెపితే గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ అని ఒక అడుగు ముందుకేశారు. అందరికీ ఇంగ్లీషు విద్య సాధికారికంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారందిరికీ ఇంగ్లీషు విద్యను తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక చరిత్ర. యావత్‌ భారతదేశం దీనివైపు చూస్తోంది. అందుకే ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించి ఒక ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ప్రకారం ముందుకు పోతున్నాం