Home / ANDHRAPRADESH / సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే

సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ… ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా సీఎం జగన్‌ తెప్పించుకున్నారు. నాయకుడికి అలాంటి సమాచారం అవసరం’ అని పేర్కొన్నారు.