Home / ANDHRAPRADESH / రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన

రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన

గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే..

– నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది
– ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం 2018–19లో రూ.3 వేల కోట్లు కేటాయించి కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
– కానీ ఈ ప్రభుత్వం ప్రజలు తినగలిగే విధంగా నాణ్యమైన బియ్యం సరఫరా కోసం రూ.4134 కోట్లు కేటాయించింది
– గత 5 ఏళ్లలో పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారన్నది చూస్తే.. ఇవాళ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు మొత్తం రూ.20 వేల కోట్ల అప్పులున్నాయి.
– రాష్ట్ర విభజన (2014–15) నాటికి ఆ సంస్థకు కేవలం రూ.6 వేల కోట్ల అప్పులు ఉండగా, 2017–18లో సంస్థ తరపున ప్రభుత్వం రూ.6500 కోట్ల అప్పు చేసింది. ఆ తర్వాత 2018–19లో ఒకేసారి రూ.7500 కోట్ల అప్పు చేసింది.
– ఆ విధంగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తరపున రూ.13,500 కోట్ల అప్పు చేసింది.
– ఆ విధంగా తీసుకున్న అప్పును వేరే అవసరాల కోసం వాడారు.
– అంతే కాకుండా బియ్యం సరఫరా కోసం గత ఏడాది బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
– అయినా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అసలు వారికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, నాణ్యమైన బియ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా?
– ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,500 కోట్లు.
– ఆ వివరాలు చూస్తే.. 2018–19 సబ్సిడీకి సంబ«ంధించి రూ.3600 కోట్లు, అంతకు ముందు ఏడాదికి సంబంధించి రూ.400 కోట్లు.
– ఇంకా అప్పుడు ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’, ‘రంజాన్‌ తోఫా’ లో సరఫరా చేసిన సరుకులకు సంబంధించి మరో రూ.1050 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది.
– ఆ విధంగా గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను కుప్ప కూల్చింది.
– అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వాడారు.
– చివరి ఏడాది పౌర సరఫరాల సంస్థ పేరుతో చేసిన రూ.7500 కోట్లను ‘పసుపు కుంకుమ’ పథకం కోసం ఖర్చు చేశారు.