ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలులో లబించిన ప్రజాదరణ,ఘన స్వాగతం గతంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్వాగతం మరెవరికి రాదని ఆయన అన్నారు. తన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిది అని ఆయన అన్నారు.సంక్షేమ కార్యక్రమాల అమలులో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జగన్ మించిపోయారని ఆయన అన్నారు. వైఎస్ కుటుంబం అంటే మాట మీద నిలబడే కుటుంబమని ఆయన అన్నారు. న్యాయరాజదాని అని ప్రకటించడం ద్వారా కర్నూలు ప్రజల మనసును జగన్ చూరగొన్నారని అన్నారు. దీనిని ప్రజలంతా మరిచిపోలేరని ఆయన అన్నారు. చంద్రబాబు అచ్చంగా అబద్దాల మీద ఆదారపడితే, జగన్ మాట మీద నిలబడే మనిషి అని ఆయన అన్నారు.