Home / ANDHRAPRADESH / భారీ కుంభకోణం అచ్చెన్నాయుడు జైలుకే

భారీ కుంభకోణం అచ్చెన్నాయుడు జైలుకే

ఈఐఎస్‌ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఏపీ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం స‍్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్‌ఐ స్కామ్‌ జరిగిందన్నారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష‍్యమన్నారు. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన‍్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి మండిపడ్డారు.