ఏపి మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలలు, స్కూళ్లు, నారాయణ ట్యాలెంట్ స్కూళ్లు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతున్నాయి. కాగా, గత వారంలో సుమారు 10మంది నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
తాజాగా మరోఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ రోజు గుంటూరు జిల్లా పరిధిలోగల వినుకొండలో నారాయణ ట్యాలెంట్ స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి జావిద్ ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రిన్సిపల్ మందలింపు కారణంగానే జావిద్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
