ప్రపంచంలోనే రెండో అతి పెద్ద నౌక విశాఖ సాగర తీరానికి చేరింది. 277 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌకలో ఒకేసారి 65వేల టన్నుల సరుకును రవాణా చేయవచ్చు. లైబీరేబియాకు చెందిన ఈ నౌక 2004 నుంచి సేవలు అందిస్తోంది. విశాఖ కంటైనర్ టెర్మనల్ బెర్త్‌లో ఈ నౌక నుంచి సరుకును ఎగుమతి, దిగుమత చేశారు. ఈ షిప్ విశాఖ తీరానికి రావడం ఇటీవల కాలంలో ఇది రెండో సారి.
