కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యక్తులు, పర్యాటక శాఖలోని కొందరు అధికారులే నేరుగా వ్యాపారం మొదలు పెట్టేశారు. పర్యాటన శాఖ మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియ శాఖపై పట్టు సాధించలేకపోవడంతో ఇదే అదునుగా అధికారులు, ఇద్దరు మంత్రులు కృష్ణమ్మపై వీర వీహారం చేస్తున్నారు.పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న అఖిలమ్మ అడ్డగోలుగా బోటులకు అనుమతులు జారి చేయ్యడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రతి పక్షం పార్టీ వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇలా ఇంతమంది చావులకు కారణమైన ఏపీ పర్యాటక శాఖ మంత్రి పదవికి భూమ అఖిల ప్రియ తక్షణమే రాజీనామా చేయ్యలాని రాజకీయ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
