ఏపీలో టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఇటీవల ఇచ్చిన నంది అవార్డులను రద్దు చేసి మళ్లీ ప్రకటించాలని ఆయన మీడియా ముందు తెలిపారు. ఇలాంటి వివాదాలు వస్తే తాను సచ్చే వరకు నంది అవార్డును తీసుకోబోనని ఆయన హెచ్చరించారు.లోకేస్ పేరిట బంగారు నంది ఇచ్చుకోండని ఆయన అన్నారు. ఒకే సామాజికవర్గానికి అవార్డులు వచ్చాయన్న విమర్శలు వచ్చాయని అన్నారు.నందులతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారా అని ఆయన అన్నారు. నంది అవార్డులు మీ అబ్బా సొత్తా అని ఆయన అన్నారు.ప్రజలతో ఎలా ఉండాలో ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా అని ఆయన అన్నారు.గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయలేదా అని పోసాని కృష్ణ మురళీ అన్నారు.
