ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్‌కు అభివృద్ధిని అడ్డుకోవడమే తెలుసన్నారు.అలాగే వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం కోర్టులో ఉన్నదని, దానిపై నేను ఏమి మాట్లాడలేనని మంత్రి పుల్లారావు అన్నారు.
