ఏపీలో కొంతమంది అధికారులు అమ్మాయిలతో అడ్డంగా పట్టుబడుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా అటవీశాఖ నిఘా విభాగం అధికారి వెంకటేశ్వరరావు రాసలీలల గుట్టు రట్టు అయ్యింది. నగరంలోని విద్యార్థి సంఘాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని డీఎఫ్‌వోతో పాటు అతనితో ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నగర శివారులోని ఓ గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు అక్కడకు వెళ్లి దాడి చేశాయి. ఈ క్రమంలో ఓ మహిళతో ఉండగా డీఎఫ్‌వో వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి..త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
