ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఎవ్వరి నోట మాట విన్న..ఏ మీడియాలో చూసిన పాదయాత్ర గురించే చర్చ జరుగుతుంది. అంతలా ప్రజల గుండెల్లో నాటుకు పోయింది. అయితే వైఎస్ జగన్ అక్కడ ..అక్కడ సభలు పెడుతూ..చంద్రబాబు పాలనపై…నవరత్నాలు గురించి…మరో పక్క వైఎస్ జగన్ చేసిన మంచి గురించి ప్రజలకు క్లుప్తంగా వివరిస్తున్నాడు. తాజాగ వెంకటగిరి నియోజవర్గం కలిచేడులో జరిగిన చేనేత ఆత్మీయ సమ్మేళంలో పాల్గొన్నారు. చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన సబ్సీడీని కూడా ప్రభుత్వం ఎత్తేసిందన్నారు.
see laso..రాయలసీమలో వైసీపీ తరుపున ఎమ్మెల్యే బరిలో స్టార్ హీరో కూతురు…!
ఎన్నికల ప్రచారంలో చేనేతలకు ప్రతి నెలా అందిస్తున్న సబ్సిడీని రూ.వెయ్యికి పెంచుతానని ఊదరగొట్టిన చంద్రబాబు.. మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని జగన్ అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక చేనేత కార్మికుడు మాట్లాడుతూ చట్టసభల్లో చేనేత కార్మికుల వాణి వినిపించేందుకు ఒక్కరు కూడా లేరని.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చేనేత వర్గాలనకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన జగన్ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను గుర్తు చేసుకున్నారు.అయితే బుట్టా రేణుకా పార్టీ ఫిరాయించినప్పటికీ ఆమెను చాలా గౌరవప్రదంగానే జగన్ గుర్తుచేసుకున్నారు. బుట్టా రేణుకమ్మ కూడా చేనేత వర్గానికి చెందిన వారేనని జగన్ చెప్పారు. ఆమెను కర్నూలు ఎంపీగా చేశామన్నారు. బుట్టా రేణుకమ్మ చేనేత ఆడపడుచేనని గుర్తు చేశారు. అంతకు మించి ఆమె గురించి నెగిటివ్‌గా ఏమీ మాట్లాడకుండా ఆగిపోయారు జగన్. భవిష్యత్తులోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యత తప్పకుండా ఇస్తామని జగన్ చెప్పారు.