ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్, మొగళ్లపాలెం మీదగా సౌత్ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్ మోపూరులో బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొనన్నారు.
