ప్రజా సమస్యల కొసం ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. జగన్ నడిచే రోడ్లన్నీ పూలతో అలంకరించి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ అశేశ ప్రజానీకం అండతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 120వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఇక నేటి యాత్ర బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం మీదుగా ములకలూరు చేరుకుంటుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గొల్లపాడు నుంచి ముప్పళ్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.దారి పొడవునా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ ముందుకు సాగుతారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ 1, 586 కిలోమీటర్లు నడిచారు.
