ఆంధ్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ, 2014 ఎన్నికలకు ముందు మిత్ర పక్షం అయిన జనసేన మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఎక్కడ వీలుదొరికితే అక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని ఇటీవల పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ మూర్ఖుడిలా ఆలోచిస్తున్నాడంటూ రెచ్చిపోయారు. నీకేమయ్యింది ఒక సినిమాలో నటిస్తే 10 నుంచి 30 కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు నీ పెళ్లాలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు నష్టపోతారు.. అంటూ రెచ్చిపోయారు. పవన్ సంపాదన వరకూ కామెంట్ చేస్తే ఓకే.. మరీ పెళ్లాం, పిల్లలు అంటూ ఓ మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం వివాదాస్పదవుతోంది. ప్రసుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
