ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక మీదుగా మణుగులూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
లంచ్ బ్రేక్ తర్వాత పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. మణుగులూరు మీదుగా ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దెందులూరు నియోజకవర్గంలోని కలకర్రు, మహేశ్వరపురం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి జననేత ఇక్కడే బస చేస్తారు. ఇప్పటి వరకు రాజన్న బిడ్డ 1988.1 కిలోమీటర్లు నడిచారు.