ఏపీ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నేతలు.. ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు. మొన్నటివరకూ టీడీపీలోకి వలసలు జరిగాయి ..కాని ఒక్కసారిగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. …ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం చూశాం.
తాజాగా టీడీపీ కంచుకొట అయిన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీ లో దాదాపుగా 100 కుటుంబాలు వైసీపీలో చేరారు. టీడీపీ,సి.పి.ఐ, సి .పి యం మరియు ఇతర పార్టీలనుండి భారీగా వైసీపీలోకి వలసలు వచ్చారు. వైసీపీ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి పార్టీ కండువకపి పార్టీ లోకి ఆహ్వానించుడం జరిగింది. అనంతరం వారు మాట్టడుతూ…మరి కొన్నిరోజుల్లో అనంతపురం జిల్లాలోని ప్రతి గ్రామంలో వైసీపీ జెండా తప్ప మరె ఏ జెండా కనబడదు అని అన్నారు. అన్ని గ్రామాల ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతీరేకత రావడంతో వైసీపీ బలం అంతకు అంత పెరుగుతుంది తప్ప ..తగ్గడం లేదని వై. వెంకటరామిరెడ్డి అన్నారు.