‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల మీద ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు పై గర్జించాడు. అధికారంలోకి వచ్చిన టీడీపీపై, నాలుగేళ్లుగా చంద్రబాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. అని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి పాలన చూశాం. ఇవాళ రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. పెట్రోలు, డీజల్ ధరలు ఎక్కడా లేనట్లు రాష్ట్రంలో భగ్గుమంటున్నాయి. లీటరుకు రూ.7 అదనంటా బాదుతున్నారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా ఉపాధి అన్నారు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ ఏదీ లేదు. ఈ లెక్కన ఈ 48 నెలలకు గాను రూ.96 వేలు బకాయి పడ్డారు. మొత్తం ఐదేళ్లకైతే ఒక్కో ఇంటికి రూ 1,20,000 ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని చివరిలో ఆరు నెలలో, నాలుగు నెలలో మాత్రమే రూ.1000 ఇస్తాడట. అది కూడా రాష్ట్రంలో ఒక కోటి 70 లక్షల మంది ఉంటే, కేవలం పది లక్షల మందికేనట.
