ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తిన ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈపాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత..2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం.అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని..కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నాలుగు సంవత్సరాలు పబ్బం గడిపారని..ఇంకా ప్రజలను మోసం చేసే మాటలే మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ అంటున్నారు.
see also:జగన్‌కు జై కొట్టిన 800 మంది కాపు నాయకులు..!
ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నేడు 198వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభించారు. ఆదివారం వరకు వైఎస్ జగన్ 2,414.2 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఓ చిన్నారి అందరి పట్ల జగన్ చూపిస్తున్న ప్రేమ చూసి నన్ను ఎత్తుకో జగన్ మామయ్య అని అనగానే… జగన్ రా…చిట్టితల్లి అని ఎత్తుకొని కాసెపు నడిచాడు. అప్పడు ఆ చిన్నారి తల్లి నా బిడ్డను..నా సోంత అన్నలా చూపించిన ప్రేమకు ఆనందం పడింది. ఇంకా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. వైఎస్ జగన్ కి ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుంది..ఎక్కడికి వెళ్లిన గుండెల్లో పెట్టుకుంటున్నారు.