వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో నిలువనున్నాసంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించారు.
see also:జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
చెరుకులపాడు నారాయణరెడ్డికి ఎంత మెజార్టీ ఇచ్చేవారో, అంతకన్నా రెట్టింపు మెజార్టీ శ్రీదేవికి ఇవ్వాలని కోరారు. అప్పటి నుండి ఇప్పటి వరుకు చెరుకులపాడు శ్రీదేవి నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తన భర్త కళను…భర్తపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాని నిజం చెయడానికి అలుపనేది లేకుండా కష్టపడుతున్నారు.
తాజాగా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామం సమీపంలో కొండపై వెలసిన కాశిరెడ్డి నాయన ఆరాధన ఉత్సవాలలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు చెరుకులపాడు శ్రీదేవి. రాంపల్లి గ్రామం లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎస్సీ కాలనీ జరిగిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పరపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ తుగ్గలి ప్రహల్లాద రెడ్డి గారు రాతన మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిరాయి జగన్నాథ రెడ్డి , జిల్లా కార్యదర్శి ఎర్రగుడి రామచంద్రారెడ్డి, పెండేకల్ మధు యాదవ్, శభాష్ పురం సర్పంచ్ హనుమంతు , రాతన ఉమన్న, కడమండ అమర్నాథ్ రెడ్డి , రాంపల్లి వెంకటరాముడు , చక్రవర్తి గారు కోటేశ్వర్ రెడ్డి ,మాజీ సర్పంచు లాలన్న, రంగస్వామి , మరియు తుగ్గలి మండలం వైసీపీ పార్టీ నాయకులు రాంపల్లి గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
see also:ఇప్పటి వరకు జగన్‌కు జై కొట్టిన.. టాలీవుడ్ ప్రముఖులు వీరే..!