వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండని సైతం లెక్క చేయకుండా జగన్ నడకని ఆపకపోవడంతో ఆయన అరి కాళ్ళు, బొటన వేళ్ళకి పుండ్లు పడి బొబ్బలు కడుతున్నాయి.అయినా పట్టించుకోకుండా తనకోసం వస్తున్న ప్రజల కష్టాలను తెలుసుకోవడానిక తనుభవిస్తున్న బాధను సైతం లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
see also:జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
అయితే తాజాగా వైఎస్ జగన్ జాతీయ పత్రిక అయిన హిందుస్థాన్ టైమ్స్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చినపుడు జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా ఆ జర్నలిస్ట్ అవాక్కయ్యాడు. కాళ్ళకు బొబ్బలచ్చి చీము కారే దశలో ఉన్నాయి. ఎంతో ఇన్ఫెక్షన్ కి గురయినా కానీ ఇంత నొప్పితో ఎలా నడుస్తున్నారని ఆ ప్రతినిధి ప్రశ్న వేసాడు. దాంతో జగన్ చిరునవ్వు నవ్వుతూ కాళ్ళకు రోజు ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంటుందని ఎంత నొప్పి ఉన్నా పాదయాత్రలో ప్రజలు ఎదురొచ్చి పలుకరించగానే ఆ నొప్పి మటుమాయం అవుతుందనని జగన్ చాల తేలిగ్గా చెప్పటంతో ఆ విలేఖరి ఆశ్చర్యపోయారు.
see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
జగన్ కాళ్ళకు బొబ్బలతో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చాల స్పష్టంగా కనబడుతుంది. ఈ ఫోటో ని చూసిన కొందరు జగన్ చాల మొండిమనిషని ఏదైనా అనుకుంటే చేసి తీరతాడని అందుకే పాదయాత్ర చేయటమే లక్ష్యంగా ఉన్న జగన్ కాళ్లకు బొబ్బలతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చిన కానీ ఆ నొప్పి ని బేఖాతరు చేస్తూ పాదయాత్ర చేయటానికే మొగ్గు చూపుతున్నాడని కొందరు సన్నిహితులు వాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులలో కూడా ప్రజల్లో ఉండటం కోసం ఇంతగా అంకితభావం చూపేవాళ్లు ఉంటారా అని అంటున్నారు.