ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య ప్రజాసంకల్పయాత్ర 206వ రోజు ముగిసింది. అయితే ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నవైఎస్ జగన్ సమక్షంలో 200 మంది పార్టీలో చేరారు. గురువారం కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొప్పిశెట్టి శ్రీనివాసరావు సహకారంతో పారీట మండపేట పార్టీ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గూటం సత్యనారాయణ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పార్టీలో చేరిన వారిలో మొసలి ప్రసాద్, తాళ్ల రాజు, కాళ్లదాసు ప్రసాద్, కత్తుల శామ్యూల్, పలివెల దొరబాబు, కాళ్లదాసు రవి, వాసంశెట్టి సాయిబాబు, వాసంశెట్టి మధు, మాత నాగేశ్వరరావు, కాళ్లదాసు నాగేశ్వరరావు, దారా రవి, తాతాపూడి జార్జి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పెయ్యిల యాకాబు, నూకపెయ్యి రాజారావు, పెట్టా కృష్ణతో పాటు మరో 180 మంది ఉన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ అధినేత కండువాలు కప్పి ఆహ్వానించారు. లీలాకృష్ణ, సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అందరూ నికి సైనికుల్లా పనిచేయాలన్నారు.
