2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఊహించని రీతిలో రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో టీడీపీ నాయకుల మధ్య వీపరీతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి సీనియర్ టీడీపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకలు అందరు వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీలోకి వలసలు జరిగాయి. చందోలి సుభాష్ పత్తికొండ భరత్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు గారు మండల కన్వీనర్ బజారప్ప అధ్యక్షతన అధిక సంఖ్యలో వైసీపీలో చేరారు. చేరిన వారిలో ముఖ్యంగా గోవిందు రంగస్వామి చిట్టిబాబు బాలకృష్ణ ఆజాద్ రవి, విద్యార్థులు వైసీపీ పార్టీలో చేరారు.
