ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల మధ్య వ్యక్తి గత విమర్శలతో హాట్ హాట్ గా సాగుతున్నాయి.ముఖ్యంగా జనసేన, వైసీపీ మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ అమ్మాయి జగన్ తో పాటు దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు సెల్ఫీ లో ఉన్న అమ్మాయి ఎవరు….? ఈ ఫోటోతో ఫుల్స్ అయింది ఎవరు… ?అసలు ఈ ఫోటో వెనుక ఉన్న అసలు విషయం ఏంటి.. అంటే ? ఆ అమ్మాయి పేరు ఆలేఖ్య…ఓ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా లోటస్ పాండ్ లో మ్యూజిక్ టీమ్ తో కలసి వచ్చిన ఆలేఖ్య జగన్ తో కలిసి ఫొటో దిగింది. ఏ సెలబ్రిటీని కలిసినా వారితో సెల్ఫీ దిగడం ఆలేఖ్యకు అలవాటు. ఈ విషయం తెలియని కొందరు వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేయాలనే ఆతృతలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. కావాలంటే కింది ఫోటోలు చూడండి….చంద్రబాబు, బాలయ్య తో కూడా ఫోటో దిగింది. కాని ఇతరుల మాద బురద జల్లడం టీడీపీ నుండి జనసేనాకి కూడ వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు.