తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జనాలను తీసుకురావాలంటూ జిల్లా పార్టీ నేతలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలసౌపా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలంతా ఎవరి తడాఖా వారు చూపించారు. డ్వాక్రా మహిళలు రాకపోతే రూ.400 కట్ చేసేస్తామంటూ బెదిరించారు. రాప్తాడు వైసీపీ ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ వివరాలు బహిర్గతం చేసారు. ఇదే మాదిరిగా అందరినీ పరిటాల అనుచరులు బెదిరించారని సమాచారం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మీటింగ్ కి రాకుండా టీ కొట్టు ఓపెన్ చేసినందుకు కొట్టులో ఉన్న తిను బండారాల డబ్బాలని పగలకొట్టి బీభత్సం చేసిన షొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అంతేకాదు.. ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తి తల పగలకొట్టి పరిటాల మనుషులు దారుణంగా ప్రవర్తించారట.. ఆఖరికి టీకొట్టు పెట్టుకొని బ్రతుకుతున్న పేద మహిళలని కూడా వదలరా.? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆరోజు కొట్టు తెరవకపోతే తమ పూట గడవని పేదలపై కూడా గూండారిగి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
