ఏపీలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అన్ని నియోజక వర్గాల్లో వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ రోజు రోజుకూ మరింత బలపడి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని నియోజక వర్గం పార్టీ కోఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మలికిపురంలో పార్టీ కార్యాలయం వద్ద కొల్లాబత్తుల రఫీక్ సుమారు 100 మంది తన స్నేహితులతో వైసీపీలో చేరారు. పార్టీకి ఆకర్షితులైన రఫీక్‌కు కండువా వేసి ఆయనతో పాటు ఫ్రెండ్స్‌ను కూడా రాజేశ్వరరావు పార్టీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. ఇప్పుడు చేరిన ఈ 100 మంది …ఒక్కొక్కరు మరో 100 మందిని ..తమ ఫ్యామీలీ నుండి..స్నేహితులను ఇలా వైసీపీ చేరుస్తామని అన్నారంట. సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి సూరిశెట్టి బాబి, నాయకులు ఇందుకూరి పిప్పరాజు, మాజీ సర్పంచ్ పోతుల కృష్ణ, గుండుమేను శ్రీనివాస్ యాదవ్, చిత్రపు చిన్నారెడ్డి, చెవ్వాకుల మాధవరావు, కలిగినీడి రమేష్, నల్లి గోపి రాజు తదితరులు పాల్గొన్నారు.
